News February 16, 2025
ఖమ్మం: మృతదేహం లభ్యం.. హత్య? ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం- మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాల్వకట్ట పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య?.. లేదా హత్య?.. అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుడు పాతర్లపాడుకు చెందిన కొల్ల సైదులుగా గుర్తించారు.
Similar News
News November 27, 2025
ఖమ్మం జిల్లాలో తొలి రోజు 99 సర్పంచి నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 99 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే, 1,740 వార్డులకు గాను 49 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.
News November 27, 2025
ఖమ్మం: మీడియా సెంటర్ ప్రారంభించిన అ.కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ఎఫ్-3లో ఉన్న డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.
News November 27, 2025
ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్’ వెలుగులు

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.


