News February 16, 2025
ఖమ్మం మోడ్రన్ రైల్వే స్టేషన్ పనులు వేగవంతం

ఖమ్మం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.25 కోట్లతో ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఓవర్ బ్రిడ్జి, విశ్రాంతి హాల్ నిర్మాణాలు పూర్తి చేసుకొన్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయంటున్నారు. ప్లాట్ ఫాం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరగా పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
Similar News
News September 18, 2025
ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్‌గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.
News September 18, 2025
నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఒక ఒక ప్రకటనలో చెప్పారు. అల్ప పీడన ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
News September 18, 2025
ఏలూరు: రోడ్డు పక్కన గాయాలతో బాలుడు.. ఆచూకీ లభ్యం

ఏలూరులోని వట్లూరు వద్ద బుధవారం రాత్రి రోడ్డు పక్క పొలాల్లో గాయాలతో పడి ఉన్న బాలుడి ఆచూకీ లభించింది. విజయవాడ రామవరప్పాడు గణేశ్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ (14) గా గుర్తించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి వెళ్లలేదు. దీంతో అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలుడిని గుర్తించారు. కాగా బాలుడు ఏలూరు ఎలా? ఎవరితో వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.