News February 2, 2025
ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు: సీఐ రమేశ్

ప్రేమించాలని బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేశ్ తెలిపారు. ప్రకాష్ నగర్కు చెందిన శ్రావణ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన బాలికను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఆమె చదువుతున్న పాఠశాలకు సైతం వెళ్లి బెదిరిస్తుండటంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News November 12, 2025
‘ఖమ్మం కలెక్టర్ సారూ.. ఇల్లు మంజూరు చేయరూ’

ఖమ్మం నగర శివారు అల్లీపురంలో నివసిస్తున్న దివ్యాంగ దంపతులు అంతోని అంజమ్మ, గోపాల్ ఇటీవలి గ్రీవెన్స్ డేలో తమ గోడును కలెక్టర్కు విన్నవించారు. ఆరోగ్యం సహకరించక, ఇల్లు కట్టుకునే స్థోమత లేక డబుల్ బెడ్రూమ్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వారు వాపోయారు. కలెక్టర్, ఇతర అధికారులైనా స్పందించి తమకు ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
News November 11, 2025
ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
News November 11, 2025
ఖమ్మం కలెక్టర్ను కలిసిన నూతన DEO

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి(డీఈఓ)గా నియమితులైన చైతన్య జైని, బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


