News February 19, 2025

ఖమ్మం: ‘యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు’ 

image

ఖమ్మం జిల్లా పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీకి చెందిన యువతిని అదే కాలనీకి చెందిన సంగాల నరసింహారావు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని వీరనారీమణుల ఆశయ సాధన సమితి సభ్యులు ఆరోపించారు. రఘునాథపాలెంలో సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి, జిల్లా కార్యదర్శి స్పందనను బాధితురాలు మంగళవారం కలిసింది. ఈ మేరకు ఉపేంద్రబాయి మాట్లాడుతూ.. పోలీసులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 28, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో CMRFచెక్కులు పంపిణీ ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత దయానంద్ పర్యటన

News March 28, 2025

అణగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చా: భట్టి

image

తాను యాక్సిడెంటల్‌గా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిని కాదని.. చాలా ఆలోచించి అణగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవన విధానం బాగుండాలని అశించానని.. మీలాగా దుర్బుద్ధితో వ్యక్తిగత స్వార్ధం కోసం రాజకీయాల్లోకి రాలేదని బీఆర్‌‌‌ఎస్ పై విమర్శలు గుప్పించారు.

News March 28, 2025

నేడు, రేపు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర, శనివారాలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మంలో జరిగే ఇఫ్తార్ విందు, పలు డివిజన్లలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం ఖమ్మం పట్టణంతో పాటు రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం తల్లాడ మండలంలో పర్యటించనున్నారు.

error: Content is protected !!