News April 13, 2025

ఖమ్మం: రామయ్యా.. చెట్లు ఏడుస్తున్నాయ్.!

image

‘నీ మరణ వార్త విని నువ్వు నాటిన చెట్టన్నీ నిన్ను చూడటానికి వద్దామనే అనుకున్నాయంట రామయ్య.. కానీ, ఎంతమంది ఊపిరి వదులుతారోనని ఆగిపోతున్నాయంతే’ అని వనజీవి రామయ్య మృతిపై చెట్లు బాధపడుతున్నాయంటూ వర్ణణ SMలో చక్కర్లు కొడుతోంది. పర్యావరణ హితమే ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని, ప్రకృతికి జీవం పోసి మరణించాడని పుడమి కన్నీటి పర్యంతమవుతుందని పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

మహిళలూ బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు కూడా నిత్యం వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. హెల్మెట్ వాడటం తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్​ బేబీ బెల్ట్​, ఛైల్డ్‌ క్యారియర్‌ వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.

News October 23, 2025

మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కలెక్టర్

image

బూర్గంపాడు మండలం ఎంపీ బంజారలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రారంభించారు. రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను చేపల, కౌజు పిట్టలు, మేకల పెంపకం వంటి పలు రంగాలను ఒకే ఆవరణలో నిర్వహించాలని సూచించారు.

News October 23, 2025

డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్

image

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను తెలియపరిచేందుకు రంగోలీ పోటీలు నిర్వహించారు.