News March 22, 2025

ఖమ్మం: రామయ్య తలంబ్రాలకు విశేష స్పందన: ATM రామారావు

image

ఈనెల 15 న ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా ప్రారంభించిన సీతరాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్స్ కు విశేష స్పందన లభిస్తుందని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్గో ATM రామారావు తెలిపారు. ప్రారంభించిన వారం రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 బుకింగ్స్ అయినట్లు తెలిపారు. సీతారాముల తలంబ్రాలు కావాల్సినవారు 151 రూపాయి చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే చేరుస్తామన్నారు.

Similar News

News April 22, 2025

INTER RESULTS.. ఖమ్మంలో బాలికలదే హవా.!

image

ఇంటర్ ఫలితాల్లో.. ఖమ్మం జిల్లాలో అమ్మాయిలు ప్రతిభ చాటారు. ఫస్టియర్‌లో 17,837 మందికి 12,476 మంది విద్యార్థులు హాజరు కాగా, జనరల్‌లో బాలురు 64.51, బాలికలు 77.89 శాతం, ఒకేషనల్‌లో బాలురు 43.95, బాలికలు 76.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 16,919 మందికి 12,996 మంది హాజరు కాగా, జనరల్‌లో బాలురు 72.10, బాలికలు 83.13 శాతం, ఒకేషనల్‌లో బాలురు 52.60, బాలికలు 86.90 శాతం ఉత్తీర్ణత సాధించారు.

News April 22, 2025

ఖమ్మం జిల్లా ఇంటర్ రిజల్ట్స్

image

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 16919 మంది పరీక్షలు రాయగా 12996 మంది పాసయ్యారు. 76.81 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 17837 మందికి 12476 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 69.94 శాతం.

News April 22, 2025

ఖమ్మం జిల్లా జైలులో పనికిరాని ఇనుప సామగ్రి వేలం

image

పనికిరాని ఇనుప సామగ్రిని ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులోని ఫ్యాక్టరీ స్క్రాప్‌ను ఈనెల 25న వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తిగలవారు రూ.5వేలు కనీస ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కొరకు జిల్లా జైలర్లు సక్రునాయక్ (94946 32552), లక్ష్మీ నారాయణ(97005 05151)ను సంప్రదించాలని తెలిపారు.

error: Content is protected !!