News January 6, 2025

ఖమ్మం: రూ.10 కట్టి సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పోటీ: KA పాల్‌‌‌‌‌‌‌‌

image

సర్పంచ్ అభ్యర్థులకు ప్రజాశాంతిపార్టీ అధినేత KAపాల్‌‌‌‌‌‌‌‌ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. టెన్త్‌ పాసై, రూ.10తో సభ్యత్వం పొందిన ఎవరైనా వచ్చే స్థానికఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేయవచ్చన్నారు. శనివారం ఖమ్మంలో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుతో సర్పంచులు గెలిచిన గ్రామాల్లో 100రోజుల్లోనే ఉచిత విద్య,వైద్యం అందిస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి చేయలేని భట్టి విక్రమార్క రాజీనామా చేయాలన్నారు.

Similar News

News January 9, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిర నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కారేపల్లి లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News January 9, 2025

KMM: క్వారీ గుంతలో యువకుడి అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఎర్రుపాలెం మండలంలో జరిగింది. నాగవరప్పాడుకు చెందిన రామలింగేశ్వరరావు ములుగుమాడులో ఉన్న క్వారీగుంతలో పడి మృతి చెందాడు. ఈనెల 7న కూలీకి వెళ్లిన రామలింగేశ్వరరావు తిరిగి ఇంటికి రాలేదు. ఆయనకు కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో పాటు ఫిట్స్ ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరోజే గుంతలో పడిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

News January 9, 2025

భద్రాచలంలో నేడు, రేపు తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం

image

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా రాముల వారి తొమ్మిది రోజుల ఉత్సవ అవతారాలు నిన్నటితో ముగిశాయి. భక్తులకు స్వామి వారు రోజుకో రూపంలో దర్శనమిచ్చారు. 9వ తారీఖున (నేడు) సాయంత్రం 4 గంటలకు స్వామి వారి తెప్పోత్సవం గోదావరి నదిలో అంగరంగ వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 10న తెల్లవారుజామున 5 గంటలకు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.