News September 7, 2024
ఖమ్మం: రూ.3.43 కోట్లకు వ్యాపారి ఐపీ
ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన పురుగుమందుల వ్యాపారి నూతలపాటి రవి స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.3.43 కోట్లకు శుక్రవారం ఐపీ దాఖలు చేశారు. 32 మంది రెండు దాతలను ప్రతివాదులుగా చేర్చారు. కామేపల్లి మండలం పెంజరమడుగుకు చెందిన పిటిషనర్ పండితాపురంలో పురుగుమందులు, విత్తనాల వ్యాపారం నిర్వహించాడు. వ్యాపార నిమిత్తం తెచ్చిన అప్పులు తీర్చలేక ఐపీ దాఖలు చేశారు.
Similar News
News October 12, 2024
కొత్తగూడెం: దసరా పండుగ వెలుగులు నింపాలి: కలెక్టర్
దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఊరూ, వాడా, చిన్నా,పెద్దా తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలకు కోలాటాలు, నృత్యాలతో ఎంతో సందడి చేశారని అన్నారు.
News October 12, 2024
మధిర: వాహన పూజలు చేసిన డిప్యూటీ సీఎం
విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తన క్యాంపు కార్యాలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.
News October 12, 2024
కొత్తగూడెం: తాలిపేరు నదిలో పడి ఇద్దరు యువకులు మృతి
పండగ రోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామం పరిధిలోని తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోయారు. మృతులు చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గట్టుపల్లి జంపన్న (23), సోయంలచ్చి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.