News September 7, 2024
ఖమ్మం: రూ.3.43 కోట్లకు వ్యాపారి ఐపి
ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన పురుగుమందుల వ్యాపారి నూతలపాటి రవి స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.3.43 కోట్లకు శుక్రవారం ఐపీ దాఖలు చేశారు. 32 మంది రెండు దాతలను ప్రతివాదులుగా చేర్చారు. కామేపల్లి మండలం పెంజరమడుగుకు చెందిన పిటిషనర్ పండితాపురంలో పురుగుమందులు, విత్తనాల వ్యాపారం నిర్వహించాడు. వ్యాపార నిమిత్తం తెచ్చిన అప్పులు తీర్చలేక ఐపీ దాఖలు చేశారు.
Similar News
News October 10, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> నేటి నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు
> ఖమ్మం, రఘునాథపాలెం మండలాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
> అశ్వరావుపేట మండలం వినాయకపురం ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ
> భద్రాచలం: విజయలక్ష్మి అవతారంలో దుర్గాదేవి
> ఖమ్మం టూ టౌన్‌లో సీపీఎం శాఖ సమావేశం
> ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
News October 10, 2024
విద్యకు గుమ్మంగా ఖమ్మం జిల్లా: తుమ్మల
విద్యకు గుమ్మం ఖమ్మం జిల్లా అని, ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చదువుల కేంద్రంగా ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దామని అధికారులకు మంత్రి సూచించారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్‌లతో సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ఆదేశించారు.
News October 10, 2024
ఖమ్మం: ‘ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లులపై చర్యలు’
ఖమ్మంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పక్కదారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ తెలిపారు. గత రబీ, ఖరీఫ్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్య సేకరణ చేసిన అనంతరం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే ధాన్యాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో ఆయా మిల్లులపై చర్యలు చర్యలు తీసుకుంటామని అన్నారు.