News March 23, 2025

ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.

Similar News

News March 31, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆}ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పెనుబల్లి నీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన 

News March 31, 2025

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

image

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 30, 2025

గాంధీ భవన్‌లో ఉగాది వేడుకల్లో Dy.CM భట్టి

image

హైదరాబాద్ గాంధీ భవన్‌లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!