News March 13, 2025
ఖమ్మం: రేపు మద్యం దుకాణాలు, బార్లు బంద్: సీపీ

హోలీ పండుగ సందర్భంగా ఈనెల 14న (శుక్రవారం) మద్యం విక్రయాలపై నిషేదం విధిస్తూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News December 27, 2025
T20ల్లో హర్మన్ ప్రీత్, షెఫాలీ రికార్డులు

ఉమెన్స్: SLతో జరిగిన 3వ T20లో IND ప్లేయర్లు పలు రికార్డులు సాధించారు. తాజా గెలుపుతో T20ల్లో అత్యధిక విజయాలు(77) అందించిన కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ నిలిచారు. తర్వాత AUS ప్లేయర్ మెగ్ లానింగ్(76) ఉన్నారు. మరోవైపు ఓ T20 మ్యాచ్‌లో అత్యధిక శాతం పరుగులు బాదిన బ్యాటర్‌గా షెఫాలీ(79*) నిలిచారు. ఆమె నిన్న SLపై జట్టు స్కోరు(115)లో 68.69% రన్స్ చేశారు. ఇప్పటి వరకు 2011లో హర్మన్ చేసిన 66.12% పరుగులే అత్యధికం.
News December 27, 2025
TTD సిబ్బందిపై చర్యలు

తిరుపతి SGS పాఠశాల విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం సైతం ఉండగా వారిపై చర్యలు తీసుకోలేదు. ఇదే విషయం Way2Newsలో వార్తగా రావడంతో TTD డీఈవో స్పందించారు. పాఠశాల HM చంద్రయ్యతో సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఇచ్చిన సిబ్బంది ఇద్దరిని బదిలీ చేయనున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని తిరిగి క్లాస్‌లకు అనుమతించనున్నారు.
News December 27, 2025
GNT: నేడు జీఎంసీ కౌన్సిల్ సమావేశం .

గుంటూరు నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవ్వాలని కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.


