News March 13, 2025

ఖమ్మం: రేపు మద్యం దుకాణాలు, బార్లు బంద్‌: సీపీ

image

హోలీ పండుగ సందర్భంగా ఈనెల 14న (శుక్రవారం) మద్యం విక్రయాలపై నిషేదం విధిస్తూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News March 24, 2025

ఒకే ఓవర్‌లో 6, 6, 6, 6, 4

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 30 బంతుల్లోనే 75 రన్స్ చేశారు. ఇందులో 7 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. స్టబ్స్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. మొత్తంగా 28 రన్స్ రాబట్టారు.

News March 24, 2025

ఓటీటీలో అదరగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ5లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు 400M+ స్ట్రీమింగ్ మినట్స్ నమోదైనట్లు మేకర్స్ వెల్లడించారు. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. థియేటర్లలో ₹300Crకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 1న OTTలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి హీరోయిన్లుగా నటించారు.

News March 24, 2025

ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ వర్సిటీ.. ఒప్పందం ఖరారు

image

AP: విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు జార్జియా నేషనల్ వర్సిటీ ముందుకొచ్చిందన్నారు. ₹1,300Cr పెట్టుబడి పెట్టనుందని, 500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం, GNU మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

error: Content is protected !!