News December 26, 2024

ఖమ్మం: రైతుల ఖాతాల్లో రూ.368కోట్లు జమ 

image

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్‌తో భరోసా కల్పిస్తోంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. అటు రైతుల ఖాతాల్లో రూ.368 కోట్లు జమ చేయగా ప్రతీ క్వింటాకు ధరతో సంబంధం లేకుండా రూ.75.32 కోట్లు బోనస్‌గా చెల్లించిందన్నారు. జనవరి చివరి వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. 

Similar News

News December 28, 2024

ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం వచ్చి మృతి

image

ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన <<14993247>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు వ్యక్తులు మల్లయ్య, వెంకటేశ్వర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. HYDలో ఉంటున్న మల్లయ్య ఉసిరికాయలపల్లిలో ఇందిరమ్మ సర్వే జరుగుతుండగా వివరాలు ఇచ్చేందుకు వచ్చాడు. సర్వే ముగిశాక ఇల్లందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు ఇల్లందు, ఖమ్మంలో చికిత్స పొందుతున్నారు.

News December 28, 2024

ఖమ్మం: పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే: వీపీ గౌతమ్

image

ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల సర్వే పరిశీలన యాప్ ద్వారా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర హౌజింగ్ ఎండి V.P గౌతమ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్(M) జలగంనగర్, ఖమ్మంలోని మోతి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. సర్వే ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్‌ మృతి దేశానికి తీరనిలోటు: ఎంపీ రామసహాయం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఖమ్మం సంజీవరెడ్డి భవనంలో శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, PSR యూత్ అధ్యక్షుడు దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.