News May 25, 2024
ఖమ్మం: రైలుకింద పడి బాలిక ఆత్మహత్య

‘అమ్మా నేను చనిపోతున్నాను … నా కోసం వెతకొద్దు’ అని చెప్పిన నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన మైనర్ బాలిక వరంగల్ – కాజీపేట మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం సారథినగర్‌కు చెందిన బాలిక(17) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాలికతో పాటు ఉన్న యువకుడు అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కిందపడ్డారు. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతిచెందగా యువకుడి కాలు తెగిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 16, 2025
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.
News February 16, 2025
బోనకల్: గుండెపోటుతో నిద్రలోనే యువకుడు కన్నుమూత

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోనకల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కలకోటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తోకచిచ్చు నిహార్ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి వాంతి చేసుకున్నట్లు ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిహార్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి పెద్ద కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
News February 16, 2025
పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలి: భట్టి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలని… వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. డిజిటల్ భూసర్వేకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని అన్నారు.