News November 5, 2024
ఖమ్మం: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, మృతుడు మెరూన్ రంగు షర్ట్, నీలం జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు చెప్పారు. ఖమ్మం జి.ఆర్.పి.సి భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
ఖమ్మం: మనోళ్లు జూబ్లీహిల్స్‌లో బిజీ

జూబ్లీహిల్స్‌లో ఖమ్మం నాయకులు బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు క్యాంపెయిన్ చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుకు బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు అప్పగించింది.
News October 26, 2025
ఓటర్ల జాబితా పకడ్బందీగా పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీసీ ద్వారా సమీక్షించారు. ఎస్.ఐ.ఆర్. జాబితా పూర్తి, 2002–2025 మధ్య కొత్త ఓటర్ల వివరాలను బూత్ స్థాయిలో ధృవీకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బూత్ అధికారులు BL0 యాప్ ద్వారా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్‌లు పాల్గొన్నారు.
News October 25, 2025
పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.


