News November 5, 2024
ఖమ్మం: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, మృతుడు మెరూన్ రంగు షర్ట్, నీలం జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు చెప్పారు. ఖమ్మం జి.ఆర్.పి.సి భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 8, 2024
అశ్వారావుపేటలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్
తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం అశ్వారావుపేటలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని దండాబత్తుల బజార్‌కు చెందిన సామినేని వెంకన్న, వరలక్ష్మీ దంపతుల కుమార్తె జశ్విత సాయి(17) ఇంటర్ చదువుతోంది. ఉదయం లంచ్ బాక్స్ సర్దుకునే విషయంలో తల్లీ, కూతురికి గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
News December 8, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు
> ఖమ్మంలో CPM పార్టీ డివిజన్ మహాసభ > కల్లూరులో ఎమ్మెల్యే రాగమయి పర్యటన > మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > ఢిల్లీలో రైతులపై దాడిని నిరసిస్తూ కొత్తగూడెంలో రైతు సంఘం నిరసన >చింతూరులో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన
News December 8, 2024
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా పోలీసులమంటూ బెదిరింపులు
వైరాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. నరసింహారావు అనే వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. రూ.15 లక్షలు ట్రాన్స్ఫర్ చేయకపోతే నిన్ను పోలీసులు అరెస్టు చేస్తారంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు భయపడి వారికి రూ.15 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. మరల రూ.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.