News July 27, 2024
ఖమ్మం: రైలు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం
రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందిన ఘటనపై శుక్రవారం కేసు నమోదైంది. రైల్వే జీఆర్పీ ఎస్ఐ భాస్కరరావు వివరాల ప్రకారం.. బిహార్ మధుబని మండలం బైరాకి చెందిన లలిత్ సదయ్ (22) బంధువులతో కలిసి ఈనెల 24న ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో రామన్నపేట రైల్వే గేట్ వద్ద కాలు జారి పడిపోయి మృతిచెందగా పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌కు అప్పగించారు.
Similar News
News December 12, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి కార్యక్రమాలు
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్ల సమీక్షా సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో మంచినీటి సరఫరా బంద్ ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
News December 12, 2024
ఖమ్మం: రేపు ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ: కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఏసీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ బహిరంగ విచారణ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. విచారణ కమీషన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సంఘ నాయకులు అధిక సంఖ్యలో హాజరై వారి వినతులను అందజేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News December 11, 2024
కమనీయం భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.