News March 10, 2025
ఖమ్మం: రైల్వే బోర్డు ఛైర్మన్తో ఎంపీ వద్దిరాజు భేటీ

ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రవిచంద్ర రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు.. కొత్త ప్లాట్ ఫామ్లను విస్తరించడం, కోవిడ్కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్లు వంటి అంశాలపై వివరించారు.
Similar News
News November 24, 2025
ఖమ్మం: త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

అర్హులైన రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.
News November 24, 2025
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పారిశుద్ధ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేయడానికి ప్రజావాణికి బాధితులు వచ్చారు.
News November 24, 2025
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వినూత్న కార్యక్రమం

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేపట్టిన ‘చదవండి.. అర్థం చేసుకొండి.. ఎదగండి’ కార్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతోంది. 958 పాఠశాలల్లోని 28,982 మంది విద్యార్థులకు దీనిని అమలు చేస్తున్నారు. కలెక్టర్ చొరవతో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగైందని విద్యా యంత్రాంగం గుర్తించింది.


