News August 1, 2024
ఖమ్మం: రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కారేపల్లి మండలం రావుజితండా గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సు మూలమలుపు వద్ద, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. లేకుంటే బోల్తా పడి ఉండేదని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News December 5, 2024
క్రమం తప్పకుండా ART మందులు వాడి జీవన కాలాన్ని పెంచుకోవాలి: DMHO
ఖమ్మం: ART మందులు వాడుతున్న ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా ART మందులు వాడి జీవన కాలాన్ని పెంచుకోవాలని డిఎంహెచ్ఓ కళావతి అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ART సెంటర్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో డిఎంహెచ్వో పాల్గొని మాట్లాడారు. అలాగే వైద్య అధికారులతో కలిసి హెచ్ఐవి/ ఎయిడ్స్ కు సంబంధించిన అవగాహన పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సురేందర్, మోహనరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
News December 4, 2024
పోస్టల్ శాఖలో స్థానిక అభ్యర్థులను ఎంపిక చేయాలి: ఎంపీ రఘురాంరెడ్డి
తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టల్ శాఖ ఉద్యోగాలకు 95శాతo తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో పోస్టల్ శాఖ కార్యదర్శి వందిత కౌల్ కు బుధవారం ఢిల్లీలోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పదవ తరగతిలో గ్రేడ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు.
News December 4, 2024
సత్తుపల్లి: రేపు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభం
సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్‌ను రాష్ట్ర మంత్రులతో గురువారం ప్రారంభిస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పాల్గొంటారని చెప్పారు. కావున మీడియా మిత్రులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.