News January 27, 2025

ఖమ్మం: లారీ ఢీకొట్టడంతో వ్యాపారి దుర్మరణం 

image

రోడ్డుప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి చెందిన ఘటన ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలిలా.. ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండా పంచాయతీ ఇందిరమ్మకాలనీకి చెందిన పెండ్ర వెంకన్న (48) కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. పనిమీద టీవీఎస్‌పై వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News September 16, 2025

జాలిమూడి కుడి, ఎడమ కాలువల మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

image

మధిర జాలిమూడి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం రూ. 5.41 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులను విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మరమ్మతులు పూర్తయితే, ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని ఆశిస్తున్నారు.

News September 16, 2025

ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.

News September 16, 2025

ఖమ్మం: ఆమె ఆరోగ్యమే లక్ష్యం

image

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో 26 PHCలు, 4 UPHCలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు 10 క్యాంపుల చొప్పున 12రోజుల్లో 120 క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయనున్నారు.