News January 27, 2025
ఖమ్మం: లారీ ఢీకొట్టడంతో వ్యాపారి దుర్మరణం

రోడ్డుప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి చెందిన ఘటన ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలిలా.. ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండా పంచాయతీ ఇందిరమ్మకాలనీకి చెందిన పెండ్ర వెంకన్న (48) కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. పనిమీద టీవీఎస్‌పై వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 18, 2025
బోరుబావుల నుంచి ఉబికి వస్తున్న వేడి నీరు..!

భద్రాద్రి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం పగిడేరులో పలు బోరుబావుల నుంచి వేడి నీరు ఉబికి వస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
News February 18, 2025
ఖమ్మం – సూర్యాపేట హైవే పై రోడ్డు ప్రమాదం

కూసుమంచి మండలంలో ఖమ్మం – సూర్యాపేట హైవేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హాట్యతండా సమీపంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడంతో డీసీఎం వ్యాను డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News February 18, 2025
ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. మండాలపాడుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. అతడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఆ యువతికి ఆగ్రామ మహిళలు మద్దతుగా నిలిచారు.