News March 22, 2024
ఖమ్మం లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి.!

ఖమ్మం లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా లోకసభ టికెట్ ను ఆశిస్తున్న పలువురికి అధిష్ఠానం నచ్చజెప్పి ప్రసాద్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నిర్ణయానికి పోటీలో ఉన్న మరో ఇద్దరు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఖమ్మం అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Similar News
News April 17, 2026
ఖమ్మం: పల్టీ కొట్టిన వరి కోత మిషన్.. డ్రైవర్ మృతి

కల్లూరు మండలం పెద్ద కోరుకొండి శివారులో వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 17, 2026
ఖమ్మం: ‘డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నగారా’

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) తొలిదశ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని, ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
News April 16, 2026
ఖమ్మం: ఫైర్ సిబ్బందికి ‘విశిష్ట సేవ’ పురస్కారాలు

అగ్నిమాపక సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పురస్కారాలకు ఎంపికయ్యారు. కేంద్ర ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించిన ‘బ్రాంజ్ డిస్క్’, ప్రశంసాపత్రాలను వైరాకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్ గద్దె కృష్ణ ప్రసాద్, ఖమ్మంకు చెందిన వాగదాని రాంబాబు అందుకోనున్నారు. రాష్ట్రంలో 10 మందికి ఈ గౌరవం దక్కగా, అందులో జిల్లా నుంచి ఇద్దరు ఉండటం విశేషం.


