News April 10, 2024

ఖమ్మం: వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.  కారేపల్లి మండలం తొడితలగూడెంకి చెందిన వెంకటేశ్వర్లు (55) వ్యవసాయ కూలీ పనికి వెళుతుంటారు. సోమవారం వడదెబ్బ కొట్టగా మంగళవారం చనిపోయారు. బోడు పంచాయతీ లాక్యాతండాకు చెందిన బాలాజీ, కొత్తగూడేనికి చెందిన 14,15 డివిజన్ల సీపీఐ కార్యవర్గ సభ్యుడు బక్కయ్య ఎండదెబ్బతో మృతిచెందారు. 

Similar News

News March 26, 2025

ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ: ఖమ్మం కలెక్టర్

image

యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్, గన్ని సంచులు మొదలైన మౌలిక వసతులు ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు.

News March 26, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

∆} కల్లూరును మున్సిపాలిటీగా మారుస్తాం: మంత్రి ∆} ఖమ్మం: కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ ∆} ఖమ్మం: సీతారాముల కళ్యాణానికి 197 ప్రత్యేక బస్సులు ∆} నేలకొండపల్లి: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య ∆} ‘సత్తుపల్లి MLA గారూ మా సమస్యలు ప్రస్తావించండి’ ∆} లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద లారీ బీభత్సం ∆} సదాశివునిపేటలో చోరీ.. రూ.2.35లక్షలు చోరీ ∆} ఖమ్మం: బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ

News March 25, 2025

బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ

image

IPL బెట్టింగులపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్షలో CP పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, పోక్సో కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ అధికారులతో CP సమీక్ష జరిపారు.

error: Content is protected !!