News February 19, 2025

ఖమ్మం: వడదెబ్బపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్ 

image

ఖమ్మం: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, గత సంవత్సరం దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 15, 2025

ఖమ్మం: పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం: మంత్రి తుమ్మల

image

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌లో చేప పిల్లలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. నగర పారిశుద్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పని చేయాలన్నారు. ప్లాస్టిక్, చెత్త కారణంగా దోమల వ్యాప్తి పెరిగి రోగాలు వస్తున్నాయని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సహా అధికారులు పాల్గొన్నారు.

News November 15, 2025

ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.

News November 15, 2025

KMM: జీవనశైలి మార్పులతో మధుమేహం నియంత్రణ: కలెక్టర్

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహం ‘సైలెంట్ కిల్లర్’ అని పేర్కొంటూ, రోజూ అరగంట నడక, వైట్‌ రైస్‌ తగ్గించడం, చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా నియంత్రణ సాధ్యమన్నారు. పిల్లల్లో షుగర్ పెరుగుతున్నందున ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో 55,829 మంది షుగర్ రోగులకు మందులు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.