News May 19, 2024

ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 సంవత్సరానికి ఖమ్మం జిల్లాలోని విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనానికి మే 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్ స్థాయి పీహెచ్‌డీ పోస్ట్, డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం నందు చదవాలనుకునే గిరిజన విద్యార్థిని, విద్యార్థులు ఈ పథకానికి అర్హులని అన్నారు.

Similar News

News November 28, 2025

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటన

image

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఆమె ఆసుపత్రిలో జరుగుతున్న సదరం భవన నిర్మాణ పురోగతిని, అలాగే వివిధ సివిల్ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ సూచించారు.

News November 28, 2025

ఖమ్మంకు ఎన్నికల పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్తడే కాళిచరణ్ సుధామరావు (ఐఏఎస్) గురువారం ఖమ్మం జిల్లాకు విచ్చేశారు. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి స్వాగతం పలికారు. అనంతరం పరిశీలకులు, కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పరిశీలకులు అధికారులను ఆదేశించారు.

News November 28, 2025

ఖమ్మం పల్లెల్లో ఎన్నికల జ్వరం..!

image

ఖమ్మం జిల్లాలో ఎన్నికల నియమాలు అమల్లోకి రావడంతో, పల్లెల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? అన్న మాటలే మార్మోగుతున్నాయి. ప్రజలు గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, కుటుంబ బలం, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేసుకుంటూ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి.