News November 17, 2024

ఖమ్మం: విద్యార్థికి గుండు కొట్టించిన Asst ప్రొఫెసర్

image

ఖమ్మం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థికి Asst ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 12న ములుగు జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి చైనీస్ స్టైల్‌లో కటింగ్ చేయించుకున్నాడు. దీంతో అతడి హెయిర్ స్టైల్ చూసి సీనియర్ విద్యార్థులు హేళన చేశారు. విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న ఓ Asst ప్రొఫెసర్ అతడిని కటింగ్ షాప్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు. 

Similar News

News December 2, 2024

ఈనెల 14న వాజేడు SI ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా!

image

వాజేడు ఎస్ఐ హరీశ్ తన<<14767070>> రివాల్వర్‌తో కాల్చుకొని<<>> మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా, ఈనెల 14న హరీశ్‌ ఎంగేజ్మెంట్ జరగనుందని స్థానికులు తెలిపారు. అంతేకాక ఎంగేజ్మెంట్‌కు సంబంధించి షాపింగ్ చేయాల్సి ఉందని, తన స్నేహితులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News December 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మధిరలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} భద్రాద్రి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు ∆} ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News December 2, 2024

మధిరలో ప్రజా విజయోత్సవాలు: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలలో భాగంగా నేడు మధిరలోని రెడ్డి రెడ్డి గార్డెన్స్‌లో సాంస్కృతిక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.