News December 19, 2024
ఖమ్మం: విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి: డీఎంహెచ్ఓ
రఘునాథపాలెం మండలం దానవాయిగూడెం MJPT బీసీ హాస్టల్ విద్యార్థిని లక్ష్మి భవాని కీర్తిని ఎలుక కరవడంతో మార్చి 2024లో ARV, TT ఇంజక్షన్లు అందించామని జిల్లా వైద్యాధికారి కళావతి బాయి చెప్పారు. తర్వాత హోమియో మందులు, స్కిన్ క్లినిక్ సేవలు ఇంటి వద్ద పొందారన్నారు. డిసెంబర్ 11న కాలి నొప్పితో మమత ఆసుపత్రిలో చేరగా, వెన్నెముక పరీక్షలో ప్రోటీన్ శాతం పెరిగినట్లు తేలిందన్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Similar News
News January 19, 2025
బుగ్గపాడులో దంపతులు సూసైడ్.. ఆప్డేట్
సత్తుపల్లి మండలం బుగ్గపాడులో<<15185005>> కృష్ణ, సీత దంపతులు <<>>చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణారావు లారీ, ఆటో, డీసీఎం కొనగా అవి ప్రమాదాలు, మరమ్మతులకు గురవడంతో అమ్మేశాడు. ఈక్రమంలో ఇల్లు గడవక, ఆదాయ మార్గం లేక ఇబ్బందిపడ్డాడు. తండ్రి పరిస్థితిని చూసి కుమార్తెలు సాయపడేవారు. వారిని ఇబ్బంది పెట్టలేక కృష్ణారావు దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకుని.. రావి చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నారు.
News January 19, 2025
ఖమ్మం ఖిల్లా వెయ్యేళ్ల చరిత్ర ఇదే..!
ఖమ్మం ఖిల్లాకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి కోట నిర్మాణం ప్రారంభించగా.. క్రీ.శ. 1006లో నిర్మాణం పూర్తయింది. 1531లో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్‌ను ఓడించి కోటను స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఖిల్లా కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో ఆసఫ్ జాహీల ఆధీనంలోకి పోయింది.
News January 18, 2025
ఖమ్మంలో విషాదం.. చెరువులో దంపతుల మృతదేహాలు లభ్యం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం నెలకొంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన కృష్ణ(60), సీత(55) దంపతులు అదే గ్రామంలోని రావి చెరువులో శవమై తేలడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దంపతులు ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.