News April 16, 2025

ఖమ్మం: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలలో చేరాలి: అ.కలెక్టర్

image

పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వీటితోపాటు ప్రభుత్వ కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 100 శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

Similar News

News April 24, 2025

KMM: తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్

image

వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో వేసవి కాలంలో తాగునీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణంపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News April 23, 2025

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత: ఖమ్మం కలెక్టర్

image

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మా ఇంటి మణిద్వీపం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మధిర మండలం దెందుకూరులో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మన ఆలోచనల్లో మార్పు వస్తే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు, మగ పిల్లలతో సమానంగా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు.

News April 23, 2025

ఖమ్మం: 5.8 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

image

ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడులోని ఓ గ్రానైట్‌‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీల నుంచి సుమారు 5.880 కేజీల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితుడు బానోత్ హరియాను అరెస్టు చేశారు. నిందితుడు ఒడిశాలో గంజాయి చాక్లెట్లను కొని ఖమ్మం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, నరసింహ ఉన్నారు.

error: Content is protected !!