News February 7, 2025
ఖమ్మం: వినూత్న ప్రయోగం.. విద్యార్థులకు కలెక్టర్ లేఖ

పదో తరగతి ఫలితాల్లో 100% సాధించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ధైర్యంగా హాజరయ్యేలా సిద్ధం చేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సదస్సుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హాజరు కాగా మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రతీ విద్యార్థికి తన సంతకంతో కూడిన లేఖ అందించాలని ఆయన నిర్ణయించారు. ఈవిషయమై డీఈవో ఉద్యోగులతో లేఖ తయారీపై సమీక్షించారు.
Similar News
News January 6, 2026
ఖమ్మం: ఏప్రిల్లో రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇళ్లు

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి విడతలో మంజూరైన 16,523 ఇళ్లలో ఇప్పటికే 7,341 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకోగా, 324 ఇళ్లు పూర్తికావచ్చాయి. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోంది. వచ్చే ఏప్రిల్లో రెండో విడత మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. పాతగృహలక్ష్మి ఇళ్లను సైతం ఇందిరమ్మ పథకంలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని అధికారులు తెలిపారు.
News January 6, 2026
ఖమ్మం: ఇటుక బట్టీల్లో వలస బతుకులు ఛిద్రం

ఖమ్మం జిల్లాలోని ఇటుక బట్టీల్లో వలస కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఒడిశా నుంచి పిల్లాపాపలతో వచ్చిన వందలాది కుటుంబాలు కనీస వసతులు లేని గుడారాల్లో ఉంటూ గొడ్డుచాకిరి చేస్తున్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నా యజమానులు రక్షణ చర్యలు చేపట్టడం లేదని, అధికారుల పర్యవేక్షణ కరవైందని విమర్శలు వస్తున్నాయి. ‘ఆపరేషన్ స్మైల్’ వంటి కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News January 6, 2026
యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 12,682 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 25,773 టన్నుల ఎరువులను పంపిణీ చేశామని వివరించారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు నీడ, తాగునీటి వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.


