News March 29, 2024
ఖమ్మం విషయంలో ఎందుకింత లేటు..

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉండగా, బీజేపీ తాండ్ర వినోద్ రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడంలో ఇంకా మల్లగులాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలోనూ ఈ విషయంపై స్పష్టత రాలేదు. కంచుకోటలోనూ టికెట్ కేటాయింపులో జాప్యం ఏంటని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
Similar News
News February 9, 2026
ఖమ్మం: పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, శిక్షణ పూర్తయ్యాయని, 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
News February 9, 2026
ఖమ్మం: ‘జిల్లా జైలుకు కుళ్లిన మటన్’.. నిజమెంత..?

ఖమ్మం జిల్లా జైలుకు కుళ్లిన మటన్ సరఫరా అవుతోందన్న వార్తలను జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ ఖండించారు. దీనిపై జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. జైలుకు వరంగల్‌కు చెందిన అప్రూవ్డ్ కాంట్రాక్టర్ ద్వారానే మాంసం సరఫరా అవుతుందని, ఖమ్మం స్థానిక షాపుల నుంచి కాదన్నారు. నెలలో ఒకసారి మాత్రమే ఖైదీలకు మటన్ పెడతామని, అది కూడా జైలు వైద్యుల తనిఖీ తర్వాతే వండుతామని ఆయన వివరణిచ్చారు.
News February 9, 2026
ఖమ్మం: రైతులకు ముఖ్య గమనిక.. FEB 20 చివరితేదీ

ప్రస్తుత పంట సం. 2025- 26లో కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు ఈనెల 20ని చివరి తేదీగా సీసీఐ నిర్ణయించినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి రైతులలో ఇంకా ఎవరైనా సీసీఐకి మద్దతు ధరపై పత్తి అమ్ముకునేందుకు ఉంచినట్లయితే FEB 20లోగా తీసుకొని రావాలని సూచించారు. పత్తిని విక్రయించడానికి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.


