News July 22, 2024
ఖమ్మం: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. NTR జిల్లా వాసి వెంకటరత్నం(50) కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన హైమవతి(45) కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. ముదిగొండ మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముత్తారానికి చెందిన సింహాద్రి(20) బైక్పై ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా వారి కిష్టాపురం శివారులో డోజర్ ఢీకొంది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
Similar News
News November 22, 2025
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణను ఏఐసీసీ ప్రకటించింది. నగర అధ్యక్షుడిగా దీపక్ చౌదరి నియమితులయ్యారు. డీసీసీకి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల ఆధారంగానే నియామకం జరిగింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగానూతన కమిటీని పీసీసీ నియమించింది.
News November 22, 2025
PHCలలో అరకొర సేవలు.. ప్రజలకు రేబిస్ టీకా కష్టాలు

ఖమ్మం జిల్లాలోని 22 PHCలు,3 బస్తీ దవాఖానాల్లో వైద్యులు, మందుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రేబిస్ వ్యాక్సిన్ వంటి అత్యవసర మందులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. గర్భిణులకు టెక్నీషియన్, వసతులు లేక జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారు. సేవలు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.
News November 22, 2025
‘రాంగ్రూట్’ అత్యంత ప్రమాదకరం: సీపీ సునీల్ దత్

రాంగ్రూట్లో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. కొద్దిపాటి దూరం కోసం కూడా రాంగ్రూట్ను ఆశ్రయించవద్దన్నారు. ‘మీరు చేసే పొరపాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది’ అని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సరైన మార్గంలో ప్రయాణించి, క్షేమంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.


