News July 22, 2024
ఖమ్మం: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. NTR జిల్లా వాసి వెంకటరత్నం(50) కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన హైమవతి(45) కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. ముదిగొండ మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముత్తారానికి చెందిన సింహాద్రి(20) బైక్‌పై ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా వారి కిష్టాపురం శివారులో డోజర్ ఢీకొంది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
Similar News
News October 12, 2024
మణుగూరు – బెలగావి రైలు పునరుద్ధరణ
ఈనెల 16వతేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మణుగూరు – బెలగావి రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలును దాదాపు 5 నెలల 15 రోజులు మాత్రమే తాత్కాలికంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ రైలును మణుగూరు నుంచి బెలగావి వరకు శాశ్వతంగా నడపాలని, అలాగే డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్యలో గల అన్ని స్టేషన్లలో ఆపాలని ప్రజలు కోరుతున్నారు.
News October 11, 2024
సిరిపురం దేశాన్ని ఆకర్షిస్తుంది: డిప్యూటీ సీఎం
సోలార్ విద్యుత్ పనులు పూర్తైన తర్వాత సిరిపురం గ్రామం దేశాన్ని ఆకర్షిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో వ్యవసాయ పంపు సెట్లకు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమైందో చూసేందుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి మంత్రులు వస్తారని చెప్పారు.
News October 11, 2024
ఖమ్మం: ఒకే గ్రామం నుంచి 8 మంది టీచర్లుగా సెలెక్ట్
వైరా మండలం రెబ్బవరం నుంచి 8 మంది టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. గోపాలరావు, కవిత, రాము, జాలది ఉష, దివ్య, సుజాత, శిరీష, ఖాసీమ్ డీఎస్సీ ఫలితాలలో ఉద్యోగాలు సాధించారు. వారిని రెబ్బవరం స్కూలు పూర్వ విద్యార్థుల సంఘం, గ్రామ పెద్దలు సన్మానించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పాలని వారికి సూచించారు.