News October 25, 2024
ఖమ్మం: వ్యభిచార కూపంలోకి దింపిన తల్లికి జీవిత ఖైదు

మైనర్ కుమార్తెను వ్యభిచార కూపంలోకి దింపి బలవంతంగా బంధించి చిత్రహింసలు పెట్టిన తల్లికి జీవిత ఖైదుతో పాటు కోర్టు జరిమానా విధించింది. హయత్నగర్ పోలీసుల వివరాలు.. ఖమ్మంకు చెందిన బోడిగడ్డ సంధ్య(35) 2022లో కూతురిని వ్యభిచార కూపంలోకి దింపడంతో ఆమెపై కూతురు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Similar News
News November 1, 2025
ఈ నెల 6లోగా నష్ట నివేదికలు ఇవ్వాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం: ‘మొంథా’ తుఫాన్ వల్ల జిల్లాలో జరిగిన పంట, రహదారి, విద్యుత్, చెరువుల నష్టంపై నవంబర్ 6 నాటికి నిర్ణీత నమూనాలో నివేదికలను సమర్పించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, ఆర్అండ్బీ, విద్యుత్తు, నీటిపారుదల శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్ట అంచనాలను పక్కాగా సమర్పించాలన్నారు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రతి రైతు, గ్రామం కవర్ కావాలని సూచించారు.
News October 31, 2025
రక్తదాన శిబిరానికి భారీ స్పందన: సీపీ సునీల్ దత్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 1500 మంది దాతల నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
News October 31, 2025
సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


