News August 15, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు నేడు మార్కెట్ అధికారులు సెలవు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. తిరిగి శుక్రవారం మార్కెట్ ప్రారంభం అవుతుందని, రైతులు గమనించి తమకు సహకరించాలని కోరారు.
Similar News
News December 15, 2025
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం: సీపీ

ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను సోమవారం సీపీ ఆవిష్కరించారు. పోస్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 15, 2025
రెండో విడత ఎన్నికలు.. ఏ పార్టీ ఎన్ని గెలిచిందంటే..!

ఖమ్మం జిల్లాలో జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ-117, BRS-40, CPI-04, CPM-14, TDP-1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. అటు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి.
News December 15, 2025
ఖమ్మం జిల్లాలో రెండో దశ ఎన్నికలు.. పార్టీల బలాబలాలు

▶ కూసుమంచి(41 స్థానాలు): CONG-28, BRS-12, ఇతరులు-1
▶ కామేపల్లి(24): CONG-16, BRS-6, CPI-1, TDP-1
▶ ఖమ్మం రూరల్(21): 21 CONG-9, BRS-5, CPI-3, CPM-4
▶ ముదిగొండ(25): CONG-17, BRS-2, CPM-6
▶ నేలకొండపల్లి(32): CONG-20, BRS-7, CPM-2, ఇతరులు-3
▶ తిరుమలాయపాలెం(40): CONG-27, BRS-8, CPM-2, ఇతరులు-3.


