News September 3, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. చాంబర్స్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు ఈ నెల 4,5,6న సెలవు, 7,8న (శని, ఆదివారాలు) వారంతపు సెలవు సందర్బంగా మొత్తం ఐదు సెలవు ప్రకటించినట్లు పేర్కోన్నారు. తిరిగి 9న (సోమవారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు.
Similar News
News September 15, 2024
భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదారమ్మ
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 34.9 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి క్రమేపి తగ్గుతూ వచ్చింది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News September 15, 2024
ఖమ్మం: దేవాలయంలో ఉరి వేసుకొని యువకుడి మృతి
చింతకాని మండలం వందనంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో ఉరి వేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో వంశీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. చింతకాని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు కొనిజర్ల మండలం అనంతారానికి చెందిన యువకుడని ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.
News September 15, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన