News September 13, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 4 రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 4 రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో వారంతపు సెలవులు కాగా, 16న వినాయక నిమజ్జనం, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 18వ తేదీ బుధవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
Similar News
News October 14, 2025
ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలి: కలెక్టర్

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సమీక్షించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చాలా తక్కువగా యావరేజ్ పాల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో రివ్యూ చేయాలని అదనపు కలెక్టర్కు సూచించారు.
News October 14, 2025
తల్లాడ: ప్రేమ విఫలమైందని యువకుడి సూసైడ్

ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. మల్సూరు తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 13, 2025
‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.