News December 24, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 25(రేపు)న క్రిస్టమస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా రెండ్రోజులు సెలవులు ప్రకటించామన్నారు. ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని అన్నారు. తిరిగి ఈనెల 27 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

image

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.

News December 17, 2025

బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్ పనులపై మంత్రి సమీక్ష

image

సత్తుపల్లిలోని బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్‌లో మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి నేపథ్యంలో 200 ఎకరాల మెగా ఫుడ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్‌ఎంఈ జోన్‌లలో యూనిట్ నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలన్నారు.

News December 17, 2025

ఖమ్మం విద్యార్థికి 18 ఉద్యోగాలు.. మెచ్చిన గూగుల్

image

గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కాంపిటీషన్‌లో ఖమ్మం విద్యార్థి వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచి రూ.6.50 లక్షల బహుమతిని అందుకున్నారు. ఖమ్మంలో ఇంటర్ నుంచి బీటెక్ వరకు పూర్తి చేసిన కార్తీక్ రెడ్డి తర్వాత ఉద్యోగంలో చేరారు. తర్వాత ఈ అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలిచారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనూ 18 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.