News March 8, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి నేడు రేపు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈరోజు, రేపు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కోరారు.
Similar News
News December 20, 2025
ఇంటి నుంచే యూరియా బుకింగ్: కలెక్టర్

రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా రూపొందించిన కొత్త యాప్పై కలెక్టర్ అనుదీప్ మంగళవారం సమీక్షించారు. రబీ సీజన్ నుంచి రైతులు తమ ఇంటి వద్ద నుంచే మొబైల్ యాప్ ద్వారా యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్లో డీలర్ల వద్ద ఉన్న నిల్వల (స్టాక్) వివరాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని పేర్కొన్నారు.
News December 20, 2025
ఖమ్మం ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 22న మచిలీపట్నం నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే వన్-వే స్పెషల్ రైలు (07401)కు ఖమ్మం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడితో పాటు వరంగల్ స్టేషన్లోనూ ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
News December 20, 2025
ఖమ్మం: ‘ఆమె’దే హవా

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మహిళలు సత్తాచాటారు. మొత్తం 566 జీపీలకు గాను 297 స్థానాలు మహిళలు గెలిచారు. కాగా అత్యధికంగా తిరుమలాయపాలెంలో 40 జీపీలు ఉంటే 22, రఘునాథపాలెంలో 37 జీపీలకు 20 జీపిల్లో మహిళలు విజయం సాధించారు. అలాగే వైరా నియోజకవర్గంలో జనరల్ స్థానాల్లో ఐదుగురు బీసీ, ముగ్గురు ఎస్టీ మహిళలు, సత్తుపల్లిలో ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మహిళ అభ్యర్థి విన్ అయ్యారు.


