News July 19, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. దీంతో రైతులు గమనించి వ్యవసాయ మార్కెట్ కు సరుకులు తీసుకొని రావద్దని మార్కెట్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ఓపెన్ అవుతుందని తెలిపారు.
Similar News
News July 9, 2025
ఖమ్మం జిల్లా లక్ష్యం 35,23,300 లక్షలు

వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం అటవీ శాఖ తరఫున 2,47,200, సత్తుపల్లి డివిజన్‌లో 3లక్షలు, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 3,08,920, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2,41,740, కల్లూరులో 65వేలు, వైరాలో 50వేలు, ఏదులాపురంలో 40 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇంకా మిగతా శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.
News July 8, 2025
ఖమ్మం: 15 పాఠశాలలకు రూ.12 కోట్ల నిధులు

ఖమ్మం జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. 15 పాఠశాలలను ఎంపిక చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళితో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలన్నారు. ఇందుకోసం రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
News July 8, 2025
‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేషన్ కార్డుదారులందరు ఆయా రేషన్ షాపులలో ఈ-కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 రేషన్ కార్డులకుగాను 12,03,943 మంది ఉన్నారు. ఇందులో 9,64,236 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారందరూ వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ చేయించాలని సూచించారు.