News April 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,650 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.150 పెరగగా.. అటు పత్తి ధర స్థిరంగా ఉన్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులను ఇబ్బందులను గురి చేయకుండా క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 27, 2024

రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కూనంనేని

image

అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీంతోపాటు అదానీ చేసుకున్న ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

News November 26, 2024

కొత్తగూడెం ఎయిర్‌పోర్డుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

image

తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని సీఎం తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. త్వరలోనే కొత్తగూడేనికి సాంకేతిక బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెంతో పాటు వరంగల్ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.

News November 26, 2024

‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.