News April 29, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 18,500 జెండా పాట పలికింది. అలాగే, క్వింటాల్ పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు.

Similar News

News April 16, 2026

ప్రజాపాలనతో గ్రామాల్లో మార్పు రావాలి: కలెక్టర్ అనుదీప్

image

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాల్లో మార్పు తీసుకురావాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కూసుమంచిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు మంజూరైన 16,500 ఇందిరమ్మ ఇళ్లలో 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాలని, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

News April 16, 2026

ఖమ్మంలో 18న జాబ్ మేళా.. డిగ్రీ అర్హతతో 20 ఉద్యోగాలు

image

ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈనెల 18న టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 20 ఖాళీల భర్తీకి డిగ్రీ అర్హత గల 20-40 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతో శనివారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.

News April 16, 2026

ఖమ్మం: సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతగా..

image

కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నగర అధ్యక్షుడిగా, టీపీసీసీ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ జావిద్ ఎదిగారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్లు ఖమ్మం నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయగా, పార్టీ కార్యాలయంలో గత మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జావిద్‌ను సత్కరించారు.