News July 22, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,300 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Similar News
News November 18, 2025
ఖమ్మం: సీతారామ పథకానికి అత్యధిక పరిహారం: అ. కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణపై సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి రైతులతో చర్చించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బాజుమల్లాయిగూడెం రైతులకు ఎకరాకు ₹11.44 లక్షలు, రేలకాయపల్లికి ₹12.40 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. భూముల ధరలు వార్షికంగా పెరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, బాజుమల్లాయిగూడెం రైతులకు ₹15 లక్షలు, రేలకాయపల్లి రైతులకు ₹16 లక్షల పరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.

‘ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలి’

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టిన తనిఖీలకు సంబంధించిన అంశాలపై ఆమె మరో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు.