News August 9, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి, పత్తి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,225 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి ధర రూ.25 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

Similar News

News September 19, 2024

కూసుమంచి: పాలేరు పాత కాల్వకు సాగర్ నీరు విడుదల

image

పాలేరు ఎడమ కాలువ మరమ్మతులను ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పాత కాల్వ పరిధిలోని 25వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

News September 19, 2024

పినపాక: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడెం శివారులో ఓ చెట్ల పొదల మధ్య గుర్తుతెలియని మగ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతుడు గోదావరి వరదనీటిలో కొట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 19, 2024

కనుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.