News September 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పాత పత్తి ధర రూ.7,600 జెండా పాట పలికింది. అలాగే, క్వింటా కొత్త పత్తి ధర రూ.7,011 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర,కొత్త పత్తి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

Similar News

News October 15, 2025

కార్తిక సోమవారం.. పంచారామాలకు ప్రత్యేక బస్సు

image

ఖమ్మం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం RTC ఖమ్మం విభాగం ప్రత్యేక సర్వీసును ప్రకటించింది. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్‌ లగ్జరీ బస్సు నడుపుతోంది. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. టికెట్‌ ధర పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,200గా నిర్ణయించామని, వివరాలకు 91364 46666 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

News October 15, 2025

ఆ నాలుగు మండలాల్లోనే వర్షపాతం నమోదు.!

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. కూసుమంచి మండలంలో 4.8, తల్లాడ మండలంలో 2.4, రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం రూరల్ మండలంలో 1.0 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. కాగా ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

News October 15, 2025

ఖమ్మం: 82 మంది పోలీసులకు సేవా పతకాలు ప్రదానం

image

ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో విశిష్ట సేవలందించిన 82 మంది పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను కమిషనర్ సునీల్ దత్ మంగళవారం అందజేశారు. మహోన్నత సేవ పతకం ఒకటి, ఉత్తమ సేవ ఐదు, సేవా పతకాలు 64, ఉత్కృష్ట పతకాలు 12 మందికి లభించాయి. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు పతకాలు అందుకున్నారు.