News March 22, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్రి, మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News October 25, 2025

పది విద్యార్థులు 30లోగా ఫీజు చెల్లించండి: ఇన్‌ఛార్జ్ డీఈవో

image

2026 మార్చిలో నిర్వహించే పరీక్షలకు హాజరు కానున్న పదోతరగతి, ఒకేషనల్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇన్‌ఛార్జ్ డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. రూ.50 పైన్‌తో నవంబరు 15, రూ.200ల ఆలస్య రుసుంతో డిసెంబరు 2, రూ.500 పైన్‌తో డిసెంబరు 15 లోగా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

News October 25, 2025

మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ. 2,400: కలెక్టర్

image

2025-26 మార్కెటింగ్ సీజన్‌లో మొక్కజొన్న పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 కనీస మద్దతు ధరను ప్రకటించిందని, ఈ ధరకు కొనుగోలుకు పక్కా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. జిల్లాలో 1,705 ఎకరాల సాగవుతుందన్నారు. 5,456 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

News October 24, 2025

తీగల వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

image

తీగల వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం నగరంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాల్వొడ్డు తీగల వంతెన పనులు, మున్నేరు భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ పురోగతి పనులను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలన్నారు.