News March 22, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్రి, మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News September 16, 2024

KMM: వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

గుండెపోటుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణాపురం గ్రామానికి చెందిన వట్టికూటి రమేష్ బాబు ఉదయం వాకింగ్ చేస్తూ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రమేష్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.

News September 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశుని నిమర్జన వేడుకలు
>ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
>వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి
>అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
>ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News September 16, 2024

ఖమ్మం: డబ్లింగ్ భూసేకరణ నోటిఫికేషన్ విడుదల

image

బోనకల్ మండలం మోటమర్రి గ్రామ రైల్వే స్టేషన్ నుంచి పల్నాడు, విష్ణుపురం గ్రామాల మధ్య డబ్లింగ్ రైల్వే లైన్ భూసేకరణ పనుల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు సంబంధిత రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉన్న వారు ఖమ్మం, నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా తెలిపారు.