News October 29, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 31న దీపావళి, నవంబర్ 1న అమావాస్య, నవంబర్ 2,3 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి నవంబర్ 4వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News December 24, 2025
ఖమ్మం గజగజ

ఖమ్మం జిల్లాలో ‘చలిపులి’ పంజా విసురుతోంది. గత పది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు వల్ల వాహనదారులు,మున్సిపల్ కార్మికులు, పాలు,కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి ధాటికి వృద్ధులు, పిల్లలు అల్లాడుతుండగా పొలాల వద్ద రైతులు చలిమంటలే శరణ్యమంటున్నారు. రానున్న 3రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News December 24, 2025
ఖమ్మం: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో-ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 5వ తరగతితో పాటు, 6 నుంచి 9 తరగతుల్లో ప్రవేశం కోరే విద్యార్థులు వచ్చే ఏడాది జనవరి 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ రుసుము రూ.100 చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 22, 2025
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతూ కొత్తగా నియమితులైన ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ప్రభుత్వ బీసీ స్డడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకోని గ్రూప్-3, గ్రూప్-4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కలెక్టర్‌ను సోమవారం కలిశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.


