News October 29, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 31న దీపావళి, నవంబర్ 1న అమావాస్య, నవంబర్ 2,3 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి నవంబర్ 4వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News November 13, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> మధిర మండలం జీలుగుమాడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం > వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రైతులతో ప్రత్యేక సమావేశం > భద్రాచలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య పర్యటన > వైరాలో కొనసాగుతున్న పది జిల్లాల స్థాయి క్రీడా పోటీలు > మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన> కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే > భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు
News November 12, 2024
ఖమ్మం: గ్రూప్-3 అభ్యర్థుల కోసం 87 పరీక్షా కేంద్రాలు సిద్ధం
ఖమ్మం జిల్లాలో నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ సూచించారు. 27,984 అభ్యర్థుల కోసం 87 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు, ప్రశ్నాపత్రాలు భద్రతతో కేంద్రాలకు చేరవేసి, ప్రతి 3-5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించామన్నారు. సిబ్బందికి పరీక్షల పట్ల పూర్తి అవగాహనను కల్పించారు.
News November 12, 2024
ఖమ్మం: సొంత నివాసాలు లేని మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులకు జిల్లాలో తమ తమ నియోజకవర్గాలలో సొంత నివాసాలు లేవు. భట్టి మధిర ఎమ్మెల్యేగా ఉండగా వైరాలో ఆయనకు నివాసం ఉంది. పాలేరుకు పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనకు ఖమ్మంలో నివాసం ఉంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మలకు పాలేరులో నివాసం ఉంది.