News December 15, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని సూచించారు.

Similar News

News November 28, 2025

నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

image

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.

News November 27, 2025

ఖమ్మం జిల్లాలో తొలి రోజు 99 సర్పంచి నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 99 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే, 1,740 వార్డులకు గాను 49 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.