News November 13, 2024
ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15న గురునాయక జయంతి, 16, 17న వారాంతపు సెలవు కారణంగా మూడు రోజులపాటు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 18 సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారస్థులు గమనించాలని కోరారు.
Similar News
News December 9, 2024
విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు సర్వ సిద్ధం
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9, 10 తారీకుల్లో ఎస్ఎఫ్ఎస్ బల్లేపల్లి, పాఠశాలలోని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు డిఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ప్రదర్శనలో ఇన్స్పైర్‌కు 119 ఎగ్జిబిట్లు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 486 ఎగ్జిబిట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
News December 8, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.
News December 8, 2024
మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలి: డీఈఓ
మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పెంపొందటానికి పుష్టికరమైన ఆహారం చాలా అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్ల జిల్లా స్థాయి వంటలు పోటీలను ఆయన ప్రారంభించారు. పలు స్కూల్స్ కి చెందిన కుక్‌లు పాల్గొన్నారు.